ఆయన మార్గం అనుసరణీయం
కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: సమాజంలో కుల, లింగ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మహాత్మ బసవేశ్వరుడని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. బుధవారం బసవేశ్వర జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరితో కలిసి కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. తన బోధనలతో సమాజాన్ని మూఢాచారాల నుంచి కాపాడారని కొనియాడారు. సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీబీసీడబ్ల్యూఓ ఉపేందర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీఎస్ హెచ్‌ఓ సత్తార్, ఎస్సీ డెవెలప్‌మెంట్ జిల్లా అధికారి మల్లేశం, డీవైఎస్‌ఓ హన్మంతరావు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


