నేడు కొడంగల్‌కు మంత్రి పొంగులేటి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు కొడంగల్‌కు మంత్రి పొంగులేటి రాక

Apr 17 2025 7:11 AM | Updated on Apr 17 2025 7:11 AM

నేడు

నేడు కొడంగల్‌కు మంత్రి పొంగులేటి రాక

కొడంగల్‌: రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం కొడంగల్‌కు రానున్నారు. తెలంగాణ భూ భారతి ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో ప్రవేశపెట్టనున్నారు. అందులో ఒకటి కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఉంది. కాజీపూర్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా భూ భారతి పోర్టల్‌ను మంత్రి పొంగులేటి గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి హాజరుకానున్నారు.

కరణం పురుషోత్తంరావుకు నంది అవార్డు

తాండూరు టౌన్‌: తాండూరు పట్టణానికి చెందిన సీనియర్‌ న్యాయవాది, రాజకీయ, సామాజిక వేత్త కరణం పురుషోత్తం రావుకు నంది అవార్డు లభించింది. బుధవారం హైదరాబాద్‌లో ఉజ్వల సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహించిన ఉగాది నంది పురస్కారాల ప్రదానోత్సవంలో కరణంకు అవార్డు దక్కింది. 42 సంవత్సరాలుగా రాజకీయ నాయకునిగా, సామాజిక వేత్తగా సేవలందించినందుకు గాను నంది పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాలకు గాను అవార్డు దక్కడం సంతోషంగా ఉంద న్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని పేర్కొన్నారు. పురుషోత్తం రావును పలువురు రాజకీయ నాయకులు, పట్టణ వాసులు అభినందించారు. కార్యక్రమంలో ఉజ్వల సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షురాలు ఎం లక్ష్మి, దైవజ్ఞశర్మ, ప్రజాపతి, పార్థ సారథిరెడ్డి, బాలరాజ్‌, శ్రీలత పాల్గొన్నారు.

జీవాలకు టీకాలు తప్పనిసరి

జిల్లా పశువైద్యాధికారి సదానందం

నవాబుపేట: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా రైతులు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి సదానందం సూచించారు. బుధవారం మండలంలోని ఎల్లకొండ, చిట్టిగిద్ద, నవాబుపేట గ్రామాల్లో పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మే 15తేదీ వరకు టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్‌ విశ్వనాథ్‌, సిబ్బంది శ్రీరాములు, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

కళ్ల సంరక్షణపై

జాగ్రత్తలు అవసరం

డీఎంహెచ్‌ఓ వెంకటరవణ

విద్యార్థినులకు కంటి అద్దాల పంపిణీ

అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కూల్‌ ఐ స్క్రీనింగ్‌లో భాగంగా కంటి లోపం ఉన్న విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ వెంకటరవణ తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని కేజీబీవీలో కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సంరక్షణ చాలా ముఖ్యమన్నారు. ప్రతి విద్యార్థి కళ్లను కాపాడుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 69,201 విద్యార్థులకు కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. వారిలో 55 మంది పిల్లలకు శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు పంపినట్లు వివరించారు. 3,088 మంది విద్యార్థులకు కంటి అద్దా లు అవసరమని గుర్తించి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.ప్రతి ఏటా కంటి పరీక్షలు చేయించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మంచి ఆహారం, స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జీవరాజు, డాక్టర్లు బుచ్చిబాబు, ప్రవీణ్‌, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, స్వామినాథ్‌, ఆర్‌బీఎస్‌కే బృందం పాల్గొన్నారు.

నేడు కొడంగల్‌కు  మంత్రి పొంగులేటి రాక 
1
1/2

నేడు కొడంగల్‌కు మంత్రి పొంగులేటి రాక

నేడు కొడంగల్‌కు  మంత్రి పొంగులేటి రాక 
2
2/2

నేడు కొడంగల్‌కు మంత్రి పొంగులేటి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement