స్పందించిన ఎంపీ రంజిత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

స్పందించిన ఎంపీ రంజిత్‌రెడ్డి

Jul 5 2023 5:46 AM | Updated on Jul 5 2023 5:46 AM

రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులకుప్రశంసాపత్రం అందజేస్తున్న అధికారులు    - Sakshi

రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులకుప్రశంసాపత్రం అందజేస్తున్న అధికారులు

గొర్రెల కాపరికి రూ.50 ఆర్థిక సాయం

ధారూరు: జీవనం చెల్లా చెదురు అనే శీర్షికతో ఈనెల 2న సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తకు ఎంపీ రంజిత్‌రెడ్డి మంగళవారం స్పందించారు. స్టేషన్‌ధారూరు సమీప రైలు పట్టాలపై 50 గొర్రెలు మృతి చెందడం, కొన్ని త్రీవ గాయాలకు గురైన సంఘటనపై ఎంపీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోర్నాల్‌ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కుర్వ కిష్టయ్యకు రూ.50 వేలు ఆర్థిక సహాయంగా ఇస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందే వీలుంటే కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

హత్య కేసులో ఇద్దరికి రిమాండ్‌

దోమ: హత్య కేసులో ఇద్దరు నిందితులను మంగళవారం రిమాండ్‌ తరలించినట్లు పరిగి సీఐ వెంకటరామయ్య తెలిపారు. ఈ నెల ఒకటిన మండల పరిధిలోని మోత్కుర్‌ గ్రామంలో గునిగారి చంద్రయ్యను అదే గ్రామానికి చెందిన సండి భీమయ్య, సండి మహేశ్‌ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేసిన విషయం విదితమే. అయితే నిందితులు పరారీలో ఉన్నప్పటికీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితులిద్దరూ పరిగి పట్టణ పరిధిలోని తుంకులగడ్డ గేట్‌ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. సమగ్ర దర్యాప్తుతో సాక్ష్యాదారాలను సేకరించి నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఆర్థిక అక్షరాస్యతపై క్విజ్‌ పోటీలు

వికారాబాద్‌ అర్బన్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పై క్విజ్‌ పోటీలను నిర్వహించినట్లు జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాంబాబు తెలిపారు. జిల్లాలోని 150 పాఠశాలల నుంచి 300 నామినేషన్లు అందినట్లు తెలిపారు. వీరందరికి గత నెల 27 నుంచి మండల స్థాయిలో క్విజ్‌ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 13 పాఠశాలలకు చెందిన 26 మంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహించి ఇద్దరిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. పూడూరు మోడల్‌ స్కూల్‌కు చెందిన ఎన్‌. ప్రవీణ్‌ కుమార్‌, సాదియా ఇస్మాయిల్‌లు ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 10న రాష్ట్ర స్థాయిలో జరిగే క్విజ్‌ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement