వికారాబాద్‌ మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.50.39 కోట్లు | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌ మున్సిపల్‌ బడ్జెట్‌ రూ.50.39 కోట్లు

Published Sat, Apr 1 2023 5:46 AM

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ - Sakshi

వికారాబాద్‌ అర్బన్‌: వికారాబాద్‌ మున్సిపల్‌ బడ్జెట్‌ను కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. శుక్రవారం మున్సిపల్‌లో చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజులరమేశ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కిందిస్థాయి వరకు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా కృషి చేయాలన్నారు. బడ్జెట్‌ సమావేశం అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవ తీర్మానంతో 2023–24 సంవత్సరానికి గాను రూ.50కోట్ల 39లక్షల 32వేల అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్‌లో పన్నుల రూపంలో వచ్చేవి రూ.9.54కోట్లుగా అంచనా వేసినట్లు చెప్పారు. అలాగే నాన్‌ ట్యాక్స్‌లు రూ.9.75కోట్లు, డిపాజిట్లు, లోన్‌ల రూపంలో వచ్చేవి రూ.90లక్షలు, గ్రాంట్‌ రూ.30.20కోట్లు రావచ్చని అంచనా వేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్‌ శరత్‌చంద్ర, వైస్‌చైర్మన్‌ శంషాద్‌బేగం, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

తాండూరు మున్సిపల్‌ బడ్జెట్‌సమావేశానికి గ్రీన్‌ సిగ్నల్‌

తాండూరు: మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం స్పందించింది. బడ్జెట్‌ సమావేశంలో అధికార పార్టీలోని ఇరు వర్గాల కౌన్సిల్‌ సభ్యుల మధ్య అనిశ్చితి నెలకొంది. దీంతో 2022–23 ఆర్థిక బడ్జెట్‌ ఆమోదం చెల్లదంటూ చైర్‌పర్సన్‌ స్వప్న పరిమళ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఏడాది పాటు హైకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత మున్సిపల్‌ శాఖ అధికారులకు సమస్య పరిష్కరించాలని హైకోర్టు సూచించింది. అయినా నాలుగు నెలలుగా మున్సిపల్‌ అధికారులు తాండూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల విషయంలో ఆసక్తి చూపించలేదు. కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి స్పందించారు. తాండూరు మున్సిపాలిటీలో 2022–23 ఆర్థిక బడ్జెట్‌తో పాటు 2023–24 ఆర్థిక బడ్జెట్‌ సమావేశాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిబంధనల ప్రకారం నిర్వహించాలని కమిషనర్‌కు ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను సీడీఎంఏతో పాటు కలెక్టర్‌కు, తాండూరు మున్సిపాలిటీకి ఉత్తర్వులను జారీ చేశారు.

ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement