తిరుపతి:విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. మంగళవారం సంస్థ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్, కె.గురవయ్య, సీఎజీఎంలు జే.రమణాదేవి, ఆర్.పద్మ, ఎం. మురళీకుమార్, ఎ్.శోభా వాలెంటీనా, సీహెచ్.రామచంద్రరావు, కే.సంపత్‌కుమార్, ఏ.శ్రీనివాసబాబు, జి.సుధాకర్, ఎం.శ్రీకాంత్, ఓఎస్డీ పి.ఉమాపతి, జీఎం శ్రీధర్ పాల్గొన్నారు.


