మన్నసముద్రం సర్పంచ్‌ బరిలో ఎంపీ మాతృమూర్తి | - | Sakshi
Sakshi News home page

మన్నసముద్రం సర్పంచ్‌ బరిలో ఎంపీ మాతృమూర్తి

Nov 18 2026 1:08 AM | Updated on Nov 18 2026 1:08 AM

ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు మండలం, మన్నసముద్రం సర్పంచ్‌ బరిలో తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దెల గురుమూర్తి మాతృమూర్తి మద్దెల రమణమ్మ నిలిచారు. ఆమె మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎంపీ స్వగ్రామం మన్నసముద్రం సర్పంచ్‌ స్థానం ఎస్సీ కేటగిరికి రిజర్వు కావడంతో స్థానిక ప్రజల అభీష్టం మేరకు ఎంపీ తల్లి సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేశారు. ఆమెతో పాటు ఏర్పేడు సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు తాళ్లపాక నాగార్జునరెడ్డి, తాళ్లపాక కృష్ణారెడ్డి, సీడ్‌ బతెయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నామినేషన్‌ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement