డబ్బు ఎర.. లొంగకుంటే చెర! | - | Sakshi
Sakshi News home page

డబ్బు ఎర.. లొంగకుంటే చెర!

Nov 18 2026 1:08 AM | Updated on Nov 18 2026 1:08 AM

శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కూటమి కుట్రలు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ఒత్తిళ్లు 44 వార్డుల్లో 42 చోట్ల వైఎస్సార్‌సీపీ పోటీ

శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కూటమి నాయకులు బెదిరింపుల పర్వానికి దిగారు. ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి దాడులు.. దౌర్జన్యాలతో రెచ్చిపోయిన కూటమి నేతలు రెండున్నరేళ్లలో సంపాదించిన అక్రమ సంపాదనతో డబ్బు ఎదజల్లేందుకు సిద్ధమైపోయారు. మాట వినని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను బెదిరింపులతో లొంగదీసుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.

మొదటి నుంచి అరాచకమే

శ్రీకాళహస్తి పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూటమి నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మొదట్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు చేయలేరంటూ ప్రచారం చేసినప్పటికీ, అన్ని అడ్డంకులను అధిగమించి 44 వార్డులకు గాను 140 నామినేషన్లను ఆ పార్టీ అభ్యర్థులు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులను అడ్డుకోవడం, ఇబ్బందులకు గురిచేయడం, నామినేషన్‌ పత్రాలను చించివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

42 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ పోటీ

నామినేషన్ల పరిశీలన సమయంలో నిబంధనల ప్రకారం అన్ని వివరాలతో పక్కాగా దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను సైతం తిరస్కరించేందుకు అధికారులపై కూటమి నేతలు ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మొత్తం తొమ్మిది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో అన్ని అర్హతలు, పత్రాలు ఉన్న రెండు నామినేషన్లను సైతం తొలగించారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ 42 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రత్యర్థి శిబిరంలో ఆందోళన మొదలైంది.

డబ్బు తీసుకుంటారా.. దెబ్బలు తింటారా?

ఎలాగైనా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొందరు అభ్యర్థులకు డబ్బు ఆశ చూపుతూ విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, వాటికి లొంగని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన తరుణంలో బెదిరింపు లు, ప్రలోభాలకు తెరలేపడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించి అభ్యర్థులకు భద్రత కల్పించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement