శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి టీడీపీ సీనియర్ నేత, 31వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రసాద్‌నాయుడు మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక పురపోరులో వైఎస్‌ఆర్‌సీపీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. ముక్కంటి ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్‌న్ అంజూరు తారక శ్రీనివాసులు, నాయకులు మున్నారాయల్, జయశ్యామ్ రాయల్, సునీల్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


