శ్రీవారి దర్శనానికి 6 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 72,806 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 18,564 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

అంతర్జాతీయ సదస్సులో ఎస్వీయూ ప్రొఫెసర్‌

తిరుపతి సిటీ : ఎస్వీయూ భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ బి.దేవప్రసాద్‌ రాజు అమెరికాలో నిర్వహిస్తున్న 7వ ఇంటర్నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ ఆన్‌ ఆఫ్టిక్స్‌, ఫొటోమిక్స్‌ అండ్‌ లేజర్‌ సదస్సులో బుధవారం పరిశోధన ప్రసంగం చేశారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్‌ దేవప్రసాద్‌ రాజు తన ప్రసంగంతో పాటు పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్‌, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు ప్రొఫెసర్‌ దేవప్రసాద్‌రాజుకు అభినందనలు తెలిపారు.

కార్తీక మాసం ప్రత్యేక యాత్ర

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ : కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక దర్శన ప్యాకేజీ టూర్లను ఏర్పాటు చేసినట్లు తిరుపతి డివిజనల్‌ మేనేజర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 14, 21, 28 తేదీలతో పాటు డిసెంబరు 5వ తేదీన ఒంటిమిట్ట, అహోబిలం, మహానంది, శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ టూర్‌ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి బస్సు బయలుదేరి క్షేత్రాల సందర్శన అనంతరం తిరిగి సోమవారం ఉదయానికి తిరుపతి చేరుకోనున్నట్లు వివరించారు. ఆ ప్యాకేజీకి సంబంధించి పెద్దలకు రూ.3,500, పదేళ్ల లోపు పిల్లలకు రూ.2800 ప్రయాణ టికెట్‌ ధర ఉంటుందని వెల్లడించారు. అలాగే శబరిమలై యాత్రలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు, యాత్రల కోసం 36 సీట్ల నాన్‌ ఏసీ హైటెక్‌ బస్సులు, 45 సీట్ల ఏసీ ఓల్వో మల్టీయాక్సిల్‌ సర్వీసులను అద్దెకు ఇస్తామని తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌ సంప్రదించాలని కోరారు. ఇతర వివరాలకు 0877–2289123, 9848007033, 9848802099, 9848850099 నంబర్లకు ఫోన్‌ చేయాలని, లేదా ఏపీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement