తిరుపతి సిటీ : కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ వారు ఎస్వీ వేదిక్ వర్సిటీలో ప్రతిష్టాత్మక ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ పరిశోధనా కేంద్రం ప్రారంభించారు. బుధవారం ఈ మేరకు వీసీ కె.గణపతిభట్, మాజీ వీసీ కేఈ దేవనాథన్ మాట్లాడుతూ యావత్ వేద విశ్వవిద్యాలయాన్ని ఒక సమగ్ర ఐకేఎస్ కేంద్రంగానే భావించాలని స్పష్టం చేశారు. ఆధునిక ప్రపంచానికి భారతీ య వైదిక విద్యలను శాసీ్త్రయ దృక్పథంతో అధ్య యనం చేసే వారికి తగిన చేయూతనివ్వడమే ఐకేఎస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వేద విశ్వవిద్యాలయంలో నిరంతరం సాగే పరిశోధనలు, అధ్యయనాలన్నీ అదే దిశగా సాగుతున్నాయని వివరించారు. వేదాలే మూలంగా సనాతన భారతీయ జ్ఞాన పరంపర ప్రపంచంలోనే అత్యున్నతమైనదని కొనియాడారు. ఐకేఎస్ రీసెర్చ్ సెంటర్ మంజూరు కావడం ఎంతో గర్వకారణమని, పరిశోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. డీన్ డాక్టర్ తారకరామ కుమార శర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ బలభద్ర ఉపాధ్యాయ, ఫైనాన్‌న్స్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, పీఆర్‌ఓ డాక్టర్ గంజాం రామకృష్ణ పాల్గొన్నారు.


