నాయుడుపేట టౌన్ : నాయుడుపేట ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, పట్టణాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా గెలుపొందిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ స్పష్టం చేశారు. పార్టీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రాజేశ్వరమ్మ దంపతులు బుధవారం నెల్లూరులోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అందరి సహకారంతో ప్రజాబలంతో విజయం సాధించామని తెలిపారు. కాకాణి మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని, మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు కాకాణి పూజిత, బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, తంబిరెడ్డి మోహన్‌రెడ్డి, కలికి మాధవరెడ్డి, మారంరెడ్డి ముత్యాల్‌రెడ్డి పాల్గొన్నారు.
రాజేశ్వరమ్మకు అభినందనలు
నాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రత్యేకంగా అభినందించారు. బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, కలికి మాధవరెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి పాల్గొన్నారు.


