మహిళల ఓట్లే కీలకం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఓట్లే కీలకం

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

తిరుపతి అర్బన్‌ : పరిషత్‌ ఎన్నికల్లో మహిళళ ఓట్లు కీలకంగా మారనున్నాయి. అతివలు ఎటు వైపు మొగ్గు చూపితే అటే విజయం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే సజావుగా పోలింగ్‌ సాగితే అభ్యర్థుల భవితవ్యం మహిళల ఓటుతోనే మారుతుందని వెల్లడిస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళా ఓటర్లు 6,43,752, పురుషుల ఓట్లు 6,10,515 ఓట్లు ఉన్నాయి. అయితే ప్రతి ఎన్నికలోని పోలైన ఓట్ల శాతంలో 55శాతం మహిళలు, 45 శాతం పురుషుల ఓట్లు ఉంటున్నాయి. ఈ క్రమంలో శ్రీనిధి రుణాలు, సున్నావడ్డీకే రుణాలతోపాటు, అమ్మఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు పొందిన మహిళలు వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే కూటమి పాలనలో సజావుగా మహిళలు ఓట్లు వేసుకునే అవకాశం కల్పిస్తారా అనే చర్చసాగుతుంది. మొత్తంగా మహిళల ఆశీర్వాదం ఉంటే గెలుపు నల్లేరుపై నడకేనని విశ్లేషిస్తున్నారు.

బోసిపోయిన రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌

తిరుపతి అర్బన్‌:ఎన్నికల నేపథ్యంలో సుమారు పది రోజులుగా తిరుపతి అర్బన్‌ పరిధిలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఆస్తులకు సంబందించి రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో బోసిపోయింది. సాధారణంగా ప్రతి రోజు 120 నుంచి 150 వరకు ఆస్తుల క్రయ విక్రయాలకు సంబందించి రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అయితే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కారణంగా రోజుకు కేవలం 5 నుంచి 10 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతుండడంతో కార్యాలయం ఖాళీగా దర్శనమిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement