రైల్వేకోడూరు అర్బన్: మండలంలోని వీవీకండ్రిక పంచాయతీ అరుంధతివాడకు చెందిన 15 టీడీపీ కుటుంబాలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరాయి. మాజీ వైఎస్ ఎంపీపీ, రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ మెంబర్ రామిరెడ్డి ధ్వజారెడ్డి సమక్షంలో, మాజీ సర్పంచ్ శ్రీరాంవినోద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సంటి జగదీష్, పుల్లయ్య, మణి, మహేష్, శంకరయ్య, చింతల పరమేష్, ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గోపి, హరిక్రిష్ణారెడ్డి, చెంగల్‌రెడ్డి, అంజిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బత్తలసుబ్రమణ్యం పాల్గొన్నారు.


