ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

వెంకటగిరి రూరల్‌ : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన వెంకటగిరి పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పట్టణానికి చెందిన నిడిగింటి పోలమ్మ(91) వెంకటగిరి మండలంలోని పట్రపల్లి గ్రామానికి వెళ్లేందుకు పాత బస్టాండ్‌ వద్ద బస్సు కోసం వేచి ఉంది.ఈ మేరకు అటుగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అదు పుతప్పి పోలమ్మను ఢీకొంది. ఈ ఘటనలో పోలమ్మకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ఐ ఖాదర్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement