నిందితుడిపై పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నిందితుడిపై పీడీ యాక్ట్‌

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి దాదాపు 48 కేసుల్లో ముద్దాయిగా ఉంటూ తొలిసారిగా పట్టుబడ్డ తమిళనాడుకు చెందిన ఎం.తంజి (35)పై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పీడీ యాక్ట్‌ అమలు చేశారు. తమిళనాడుకు చెందిన ఎం. తంజి ఎరచ్రందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇతనిపై పీడీ యాక్ట్‌ అమలుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సిఫారసు చేశారు. ఈ మేరకు కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అతనిపై పీడీ యాక్ట్‌ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. పీడీ యాక్ట్‌ అమలులో భాగంగా నిందితుడిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి అర్బన్‌: దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్‌ పాఠశాలల్లో 6, 9 తరగతుల ప్రవేశాల కోసం నిర్వహించే ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ 2027–28కి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యాసంస్థల అధినేత ఎన్‌.విశ్వనాథ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుందని వెల్లడించారు. 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 01–04–2015 నుంచి 31–03–2017 మధ్య జన్మించిన విద్యార్థిని విద్యార్థులు, 9వ తరగతిలో ప్రవేశం పొందడానికి 01–04–2012 నుంచి 31–03–2014 మధ్య జన్మించిన వారు అర్హులని వివరించారు. విద్యార్థులు దరఖాస్తులను ఈ ఏడాది డిసెంబర్‌ 2లోపు సమర్పించాలని, ప్రవేశ పరీక్ష 2027 జనవరి 31న జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష విధానం, సిలబస్‌ నమూనా ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్టులు, ప్రత్యేక శిక్షణ, ఇతర పూర్తి వివరాల కోసం తిరుపతిలోని వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్‌ – నవోదయ పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాం వారిని 8688888802, 9399976999 సంప్రదించవచ్చని తెలిపారు.

ఇద్దరికి ఐదేళ్ల జైలు

తిరుపతి లీగల్‌: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్లు చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికీ ఆరు లక్షల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అర్చన మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం.. 2019 నవంబర్‌ 16వ తేదీ ప్రొద్దుటూరు రేంజ్‌ ఫారెస్ట్‌ సిబ్బంది కాజీపేట సెక్షన్‌, బాలసింగపల్లి బీట్‌, లంకమల్ల రిజర్వ్‌ ఫారెస్ట్లో తనిఖీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం, అహోబిలంకు చెందిన రాగి పాములేటి, పులి ఆవులయ్య 476 కిలోలకు పైగా బరువున్న 17 ఎర్రచందనం దుంగలను తరలిస్తూ పట్టుబడ్డారు. ఫారెస్ట్‌ సిబ్బంది ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement