తిరుపతి సిటీ:కరకంబాడి రోడ్డులోని శ్రీరామ అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 41మంది విద్యార్థులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఓ ప్రముఖ ఐటీ సంస్థ ప్రతినిధులు కళాశాలలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు విశేష స్పందన లభించింది. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఐటీ కంపెనీ ప్రతినిధి ముత్తుస్వామి, కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్‌కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వాసు, ప్లేస్మెంట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


