ధర్మం, న్యాయమే గెలిచింది | - | Sakshi
Sakshi News home page

ధర్మం, న్యాయమే గెలిచింది

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

● దుర్మార్గాలకు తెరదించుతూ నాయుడుపేటలో తంబిరెడ్డి రాజేశ్వరమ్మ విజయం ● పేట ప్రజలకు రుణపడి ఉంటాం ● మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి

నాయుడుపేట టౌన్‌: టీడీపీ నేతలు ఎన్ని దుర్మార్గాలు, దౌర్జన్యాలకు పాల్పడి అడ్డంకులు సృష్టించినా ధర్మం, న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలోని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో ఆయన తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులు బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, తంబిరెడ్డి మోహన్‌రెడ్డి, తంబిరెడ్డి సురేష్‌రెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు దబ్బల శ్రీమంత్‌రెడ్డి, కట్టా భవానీశంకర్‌రెడ్డి, చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి తదితర నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాయుడుపేటలో మున్సిపల్‌ ఎన్నికలు అత్యంత ఉద్వేగభరిత వాతావరణంలో జరిగాయన్నారు. నామినేషన్‌ పర్వం మొదలైనప్పటి నుంచి అనేక రకాలుగా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు ఇబ్బందులు పెట్టినా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు స్థానిక నాయకులు ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు.

అందరి సహకారంతోనే..

మాతృ సమానురాలైన తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు నాయకుల సమష్టి కృషి ఫలితంగా ఘన విజయం సాధించారని మాజీ మంత్రి కాకాణి తెలిపారు. నాయుడుపేట సీఐ వెంకటరమణ సభ్యసమాజం తలదించుకునేలా మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు నాయకులపై లాఠీచార్జ్‌ చేసి గుండాయిజం చేయడం దారుణమన్నారు. అనేక అవినీతి కేసుల్లో ఇరుక్కుని పలుమార్లు సస్పెండ్‌ అయిన సీఐ వెంకటరమణకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అంతేకాకుండా తమ పార్టీ నేత కామిరెడ్డి రాజారెడ్డి ఇంట్లో అక్రమంగా మద్యం బాటిళ్లుపెట్టి దుర్మార్గంగా వ్యవహరించిన తీరును కాకాణి గుర్తుచేశారు. సంజీవయ్యతో పాటు ఇక్కడ చైర్‌పర్సన్‌కు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ అగ్రశ్రేణులందరూసంజీవయ్యకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ అండగా నిలిచారని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ వైపే ప్రజలు

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికే ప్రజలు మొగ్గు చూపుతారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఈ క్రమంలోనే జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి అఖండ విజయం చేకూర్చేలా ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ చైర్‌పర్సన్‌గా విజయం సాధించి ప్రభంజనం సృష్టించారని, ఆమె విజయాన్ని పట్టణ ప్రజలతో పాటు నాయకులందరికీ అంకితం చేశామని తెలిపారు. అదేవిధంగా పార్టీ అధినేత జగనన్నకు నాయుడుపేట పీఠాన్ని కానుకగా ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement