పోలింగ్ కేంద్రాలను ఆక్రమించిన కూటమి నేతలు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను తరిమివేసిన పచ్చగూండాలు
సహకరించిన పోలీసులు,
పోలింగ్ అధికారులు
రౌడీమూకలకు భయపడి ఓటింగ్‌కు ఉత్సాహం చూపని తిరుపతివాసులు
యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్న కూటమి పార్టీల ఏజెంట్లు
అత్యధికం పుత్తూరు.. అత్యల్పం తిరుపతి
తిరుపతిలో దొంగ ఓటర్లను అడ్డుకుంటున్న సీపీఎం నేతలు
తిరుపతిలో దొంగ ఓటర్లను అడ్డుకుంటున్న నేత
పచ్చఖాకీ ఆగడాలపై ఆగ్రహం
నాయుడుపేట టౌన్ : నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఐ వెంకటరమణ వ్యవహరించిన తీరుపై పలువురు మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం పట్టణంలోని ముస్లిం వీధి 14వ వార్డు పరిధిలోని వైఎస్సార్‌సీపీ నేత చెన్నారెడ్డి కిషోర్‌రెడ్డి నివాసం వద్దకు సీఐ వెంటకరమణ వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు సీఐని నిలదీశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పోలీస్ వృత్తినే కించపరిచేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సగుటూరు మాధవితో కూడా సీఐ వెంకటరమణ ఇదే విధంగా వ్యవహరించారని తెలిపారు. 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అయిన వేలూరు కన్మణిని సైతం సీఐ వెంకటరమణ లాఠీతో నెట్టడంపై మహిళలు భగుమన్నారు. 9వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని రమాదేవి మాట్లాడుతూ తనతో కూడా పోలీసులు అభ్యంతరకరంగా వ్యవహరించారని ఆరోపించారు. తన భర్త నరసింహనాయుడుతో పాటు పలువురు కుటుంబ సభ్యులను అరెస్టు చేసి పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షి, తిరుపతి : తిరుపతి కార్పొరేషన్ సహా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో అధికారపార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థులను దౌర్జన్యంగా తరిమేశారు. గూండాయిజానికి భయపడిన తిరుపతి ఓటర్లలో అధికులు పోలింగ్‌కు దూరంగానే ఉండిపోయారు. ఇదే అదునుగా టీడీపీ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ అనుచరులు దొంగ ఓట్లు వేసుకున్నారు.
రౌడీమూకల హల్‌చల్
తిరుపతి కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు ఇవ్వాల్సిన ఓటర్ స్లిప్పులను టీడీపీ వారు తీసుకొని దొంగ ఓట్లు వేయించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరింపులకు గురిచేశారు, సీసీ కెమెరాలను పక్కకు తిప్పేశారు. మరి కొన్ని చోట్ల ధ్వంసం చేశారు. అనంతరం టీడీపీ గూండాలు ఆ ఓటరు స్లిప్పులతో పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తిరుపతి నగరంలో టీడీపీ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాసులు, శాప్ చైర్మన్ రవినాయుడు పోలింగ్ సెంటర్లలోకి రౌడీమూకలతో వెళ్లి హల్‌చల్ చేశారు. మహిళా యూనివర్సిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రంలోకి భారీగా టీడీపీ శ్రేణులు చొరబడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని మాత్రం 100 మీటర్ల అవతలే ఉంచారు. తిరుపతి నగరంలోని 49వ వార్డులో దొంగ ఓట్లు వేసుకున్నారు. తిరుపతి నగరం 36వ వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రంలో జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ అరాచకం సృష్టించారు. సుమారు 200 మంది అనుచరులతో చొరబడి అరగంట పాటు హల్‌చల్ చేశారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఆపై అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థి ఇమామ్‌పై దాడిచేశారు. 500కు పైగా ఓట్లను పచ్చమూక రిగ్గింగ్ చేసుకున్నట్లు ఇమామ్ అరోపించారు. 7, 9 వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో స్థానికేతరులైన మహిళలను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారు. తిరుపతి నగరంలోని 22వ వార్డు పరిధిలోని టీపీపీఎం స్కూల్ వద్ద ఓటింగ్ వచ్చిన స్థానికులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. విషయం గమనించిన మాజీ మేయర్ డాక్టర్ శిరీష టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసుల తీరును తప్పుబట్టారు. తిరుపతిలోని 53వ వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌గా కూర్చుకున్నందుకు చైతన్యయాదవ్‌పై టీడీపీ గూండాలు దాడి చేసి.. కారుని ధ్వంసం చేశారు. సాయంత్రం 3 గంటలు దాటాక తిరుపతి నగరంలోని 66 డివిజన్లలో టీడీపీ గూండాలు చొరబడి యథేచ్ఛ రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
వెంకటగిరిలో...
వెంకటగిరి మున్సిపాలిటీలోని 12, 21వ వార్డులో పోలింగ్ బూత్‌లలోకి తమను అనుమతించలేదంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు జలగం కామాక్షమ్మ, ఆరిశంకరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసు కున్న పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఎన్నికల అధికారులతో మాట్లాడి అభ్యర్థులను అనుమతించేలా చేశారు. అలాగే 17వ వార్డులో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌లను అధికారపార్టీ నేతలు కిడ్నాప్ చేయడంపై జనరల్ ఏజెంట్ కోవ్వూరు ఏకాంబరం ప్రశ్నించగా అతనిపై దాడి చేశారు.
గుర్తులు తారుమారు.. పోలింగ్‌కు అంతరాయం
వెంకటగిరి పట్టణంలోని 35వ వార్డులో ఉదయం రెండుగంటల పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. బ్యాలెట్ పేపరలో టీడీపీ అభ్యర్థి పేరు ఎదురుగా వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గుర్తు ఉండటంతో ఏజెంట్లు కంగుతిన్నారు. సుమారు రెండు గంటల అనంతరం తప్పులు సవరించిన బ్యాలెట్ పేపర్లు తీసుకువచ్చి పోలింగ్‌ను ప్రారంభించారు.
నాయుడుపేటలో..
నాయుడుపేట మున్సిపల్ ఎన్నికలను టీడీపీ నేతలు పోలీసుల సహకారంతో తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మొదలు ముఖ్యమైన వైఎస్సార్‌సీపీ నేతలందరిని హౌస్ అరెస్ట్ చేశారు. అక్రమ మద్యం కలిగిఉన్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలను సీఐ వెంకటరమణ తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి భర్త రఫీ పోలింగ్ బూత్‌ల వద్ద దురుసుగా ప్రవర్తించారు.
పుత్తూరులో..
పుత్తూరు మున్సిపాలిటీలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. స్థానిక మెయిన్ స్కూలు ప్రాంగణంలోని 33వ వార్డులో వైఎస్సార్‌సీపీ నేత మనోజ్‌రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు.
సూళ్లూరుపేటలో..
సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు కట్టడి చేశారు. పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు.
నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బత్తల గీతాయాదవ్
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటింగే కీలకం. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు. అలాంటి పవిత్రమైన ఎన్నికల ప్రక్రియను టీడీపీ నేతలు అపహాస్యం చేశారు. ఓటర్ల అభిప్రాయానికి విలువలేకుండా పోలింగ్‌కు బదులు రిగ్గింగ్ చేపట్టి తమ అరాచకాలను కొనసాగించారు.
జిల్లా వ్యాప్తంగా పురపోరులో యథేచ్ఛగా రిగ్గింగ్
బురఖా వేసుకుని...
తిరుపతి కల్చరల్: నగరంలోని 41వ వార్డులో టీడీపీ నేతలు పలువురికి బురఖా వేసి దొంగ ఓట్లు వేయించుకున్నారని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల గీతా యాదవ్ ఆరోపించారు. పోలింగ్ బూత్ ఎదుట నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని వాపోయారు. ఈ వార్డులో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.


