రాష్ట్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం. పచ్చమూక దాడులు, దౌర్జన్యాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేకుండా చేశారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ పోలీసు యంత్రాంగం సిగ్గుపడాలి. జిల్లాలో ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు ఏకంగా 61 ఎన్నికల సంబంధిత కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దొంగ ఓట్లు, రిగ్గింగ్‌పై ఎన్నికల అధికారులు స్పందించి రీపోలింగ్‌కు ఆదేశించాలి. – ఎంపీ గురుమూర్తి
ప్రజాస్వామ్యం.. అపహాస్యం
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలను టీడీపీ గూండాలు తమ అరాచకాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఎన్నికలను సజావుగా జరిపించాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ టీడీపీ నేతలు, ఎన్నికల అధికారులు, పోలీసులు బేఖాతర్ చేశారు. ప్రజాక్షేత్రంలో గెలవలేమనే భయంతోనే కూటమి నేతలు నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్ వరకు దారుణంగా వ్యవహరించారు. ఈ దుర్మార్గాలపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. – ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం
పచ్చమూకలా ఖాకీలు
పోలీసులు ఖాకీ యూని ఫామ్ వేసుకున్న పచ్చమూకలా వ్యవహరించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అరాచకాలు సృష్టించారు. టీడీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలింగ్ బూత్‌ల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఏజెంట్లకు ఫారాలు ఇవ్వకముందే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందిపెట్టారు. పోలింగ్‌కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ప్రజా వ్యతిరేకతను గమనించి, ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయించారు.. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారు. – మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య


