శ్రీకాలహస్తి: బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన వరల్డ్ కరాటే చాంపియన్‌షిప్‌లో అండర్–16 విభాగానికి సంబంధించి శ్రీకాళహస్తికి చెందిన బొద్దులూరు జ్యోతీశ్వర్ గోల్డ్ మెడల్ సాధించాడు. బెంగళూరులోని స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న జ్యోతిశ్వర్ తన పోరాట పటిమ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో జ్యోతిశ్వర్ ప్రథమ స్థానంలో నిలవగా, రెండో స్థానంలో కజకిస్తాన్, మూడో స్థానంలో రష్యా నిలిచాయి. జ్యోతిశ్వర్‌కు మాస్టర్ సంపత్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


