చంద్రగిరిలో రౌడీరాజ్యం | - | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో రౌడీరాజ్యం

Nov 2 2026 1:47 AM | Updated on Nov 2 2026 1:47 AM

● స్థానిక ఎన్నికల్లో నిలబడిన వారికే పదవులు ● కష్టపడిన వాళ్లకు సైతం ప్రాధాన్యం : చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తిరుపతి రూరల్‌ : ప్రశాంతమైన చంద్రగిరి నియోజకవర్గంలో రౌడీరాజ్యం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి రూరల్‌ మండలంలోని 28 ఎంపీటీసీ సెగ్మెంట్లలో ఆయన విస్తృతంగా పర్యటించారు. చెవిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా నిలబడిన వారికే భవిష్యత్తులో పదవులు, అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి సేవలందించామని చెప్పారు. తాను పదేళ్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏనాడూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదని, పార్టీలకు అతీతంగా అందరినీ గౌరవించామని తెలిపారు. ప్రస్తుతం దాడులు, బెదిరింపుల సంస్కృతి పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బయటి ప్రాంతాల నుంచి కిరాయి గూండాలను తీసుకొచ్చి గ్రామాల్లో గొడవలు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని కోరారు. పోలింగ్‌ రోజున వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. పార్టీ కోసం కష్టకాలంలోనూ నిబద్ధతతో పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించబోమని స్పష్టం చేశారు. విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement