తిరుపతి అన్నమయ్య సర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా అందిస్తున్న కార్గో సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా సోమవారం నుంచి క్యూ ఆర్ కోడ్ అమలుకు శ్రీకారం చుట్టారు. వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడం, పార్శిల్ బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం లక్ష్యంగా క్యూఆర్ కోడ్ ద్వారా ప్రీ–బుకింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు తిరుపతి సీబీఎస్ కార్గో ఇన్‌చార్జి నిర్మల తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన అనంతరం వినియోగదారులు పార్శిల్ పంపే ప్రాంతం, చేరవలసిన ప్రాంతం, పంపేవారి, స్వీకరించే వారి పేర్లు, ఫోన్ నంబర్లు, పార్శిల్ వివరాలు, నగదు చెల్లింపు విధానం వివరాల ను నమోదు చేయాలి. వాటిని నిర్ధారించిన వెంటనే ప్రీ–బుకింగ్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ కోడ్‌ను బు కింగ్ కౌంటర్ వద్ద చూపించడం ద్వారా, వివరాలను తిరిగి నమోదు చేయాల్సిన అవసరం లేకుండా పార్శి ల్ బుకింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవచ్చు.


