రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం
తిరుపతి సిటీ: ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా నేటి పాలకులు వ్యవహరిస్తున్నారు. ప్రజాభీష్టంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలను స్వార్థ రాజకీయాల కోసం నిర్వీరం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రణరంగాన్ని తలపించింది. ప్రత్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, పత్రాలను లాక్కొని చించివేయడం, దాడులు చేసి రక్తపాతాన్ని సృష్టించడం యావత్ ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. త్వరలో జరగనున్న ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం, పోలీసులు, జిల్లా అధికారులు సజావుగా, పారదర్శకంగా జరపాలని, అధికార పార్టీ హింసను ప్రేరేపిస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


