రేణిగుంట : రాష్ట్ర స్థాయి గ్రాప్లింగ్ పోటీలలో రేణిగుంట బాలికల పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభకనబరిచి బంగారు పతకాలు అందుకున్నట్టు పాఠశాల పీడీ గొడుగు చింత పద్మ తెలిపారు. గన్నవరంలో ఈనెల 24, 25 తేదీలలో 4వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ స్థాయిలో బీచ్ గ్రాప్లింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నట్టు వెల్లడించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలలో రేణిగుంట ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాల నుంచి మొత్తం 25 మంది విద్యార్థినులు పాల్గొని ప్రతిభ కనబరిచారని తెలిపారు.
అండర్ –11 విభాగంలో..
ఏడుగురు విద్యార్థినులు అండర్ – 11 విభాగంలో పాల్గొనగా అందులో దమరి, రిషి ప్రియ, మహిత, సాహితి, మోక్షిత, హిమశ్రీ (బంగారు), త్రివేణి (సిల్వర్) మెడల్ సాధించారు.
అండర్ –13 విభాగంలో..
అండర్–13 విభాగంలో స్వాతి, కోమలిరెడ్డి, హరిణి, చైత్ర, కార్తీక, నిషా (బంగారు)పతకాలు సాధించారు. అండర్ –15 విభాగంలో 8 మంది విద్యార్థినులు పాల్గొనగా మోక్షిత, కీర్తిప్రియ, శ్రీవళ్లి, భార్గవి, దీక్షిత, పూజ, మేఘన (బంగారు), చరిత సిల్వర్ మెడల్ సాధించినట్టు వెల్లడించారు.
క్యాడెట్స్ (ఇంటర్ మీడియట్ )విభాగంలో...
క్యాడెట్స్ విభాగంలో నలుగురు గోమతి, యశస్విని, ఉషశ్రీ, గ్రేసీ పాల్గొని బంగారు పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయి గ్రాప్లింగ్ పోటీలలో ఆల్రౌండర్ ప్రతిభతో పథకాలు సాధించిన 12 మంది రేణిగుంట ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వారిలో రిషి ప్రియ(6వ తరగతి ), సాహితి(6వ తరగతి), మహిత (6వ తరగతి), కోమలిరెడ్డి (7వ తరగతి ), చైత్ర (7వ తరగతి), మేఘన (7వ తరగతి), హరిణి (8వ తరగతి ), కీర్తిప్రియ (8వ తరగతి ), సి.మోక్షిత (8వ తరగతి ), దీక్షిత (8వ తరగతి ), పూజ (9వ తరగతి), ఉషశ్రీ (ఇంటర్ ద్వితీయ ) ఉన్నారు. వీరంతా ఈనెల 28వ తేదీన హరిద్వార్‌లో జరిగే 4వ జాతీయ స్థాయి బీచ్ గ్రాప్లింగ్ పోటీలలో పాల్గొననున్నట్టు పీడీ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను హెచ్‌ఎం శ్యామలదేవి అభినందించారు.


