ప్రభుత్వం మనదే.. వేసేయ్‌ పాగా! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మనదే.. వేసేయ్‌ పాగా!

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

● ఐదు రోజులుగా జేసీబీలు పెట్టి చదును చేస్తున్న కూటమి నేతలు ● కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు

పెనగలూరు 50 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

దామనచర్లలో ప్రభుత్వ భూమిని జేసీబీతో చదును చేసిన దృశ్యం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కూటమి నేతలు బాగా ఒంటబట్టించుకున్నట్టుంది. అందుకే అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న ఆలోచనలో మునిగిపోయినట్టు స్పష్టమవుతోంది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఐదు రోజులుగా సాగుతున్న భూకబ్జానే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

అసలేం జరుగుతోందంటే?

పెనగలూరు మండలం, కొండూరు పంచాయతీ, దామనచర్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నం.1లో యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి నాయకులు గద ఐదు రోజులుగా జేసీబీలతో చదును చేసి ఆక్రమిస్తున్నారు. టీడీపీ, జనసేన నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రాత్రికి రాత్రే సిద్ధమైపోయారు. మండలమంతా నామినేషన్లలో మునిగి తేలుతుండగా కబ్జాకోరులు జేసీబీలు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా చెట్లను తొలగించారు. కోట్ల రూపాయల విలువచేసే యాభై ఎకరాల భూమిని చదును చేశారు. ఇందులో స్థానికులే కాకుండా టీడీపీ, జనసేన నాయకులు, మండలంలోని ఇతర గ్రామాలకు చెందినవారు కూడా పాల్గొన్నట్లు తెలిసింది. నామినేషన్లు వేసేవారికి ధృవీకరణ పత్రాలు అందించేందుకు ఇటు గ్రామ సేవకులు, రెవెన్యూ సిబ్బంది మండల కేంద్రంలో ఉండగా వారిపని వారు చేసుకుంటూ వెళ్లారు. నామినేషన్ల సమయంలో అయితే రాత్రింబవళ్లు భూమిలో పనులు చేయవచ్చని నిర్ణయించుకొని అక్కడ దిగినట్టు తెలుస్తోంది.

మాకేం సంబంధం లేదు

ఐదు రోజులుగా కబ్జాదారులు జేసీబీలు పెట్టి చదు ను చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామస్తుల సమాచారం మేరకు రెవెన్యూ అధికారులకు తెలిసినా తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నామినేషన్‌ దగ్గర ఉన్నామని, తమకు తెలియదని అధికారులు చెప్పుకొస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement