తిరుమల: శ్రీపాదరాజ మఠం, ములబాగల్ పీఠాధిపతి పరమపూజ్య జగద్గురు సుజయనిధి తీర్థ స్వామీజీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. తిరుమలలోని పాత అన్నప్రసాదం సముదాయం సమీపంలోని రావిచెట్టు వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ సంప్రదాయం ప్రకారం పెద్ద మర్యాదతో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం టీటీడీ ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి స్వామీజీకి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఇస్తికపాల్ మర్యాదలతో స్వామీజీని బేడి ఆంజనేయస్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం స్వామీజీ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, పేష్కార్ రామకృష్ణ పాల్గొన్నారు.


