గమ్యం.. గగనం | - | Sakshi
Sakshi News home page

గమ్యం.. గగనం

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్‌ ద్వారా 2,232 కిలోల బరువు గల నావిగేషన్‌ శాటిలైట్‌ (నావిక్‌–03) ఉపగ్రహాన్ని ఈనెల 30వ తేదీ రాత్రి 11.55 గంటలకు ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో వేదిక నుంచి ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. 49.13 మీటర్లు పొడవైన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–18 రాకెట్‌ ప్రయోగ సమయంలో 416 టన్నుల బరువుతో భూమినుంచి నింగికి బయలు దేరుతుంది. వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ (వ్యాబ్‌)లో రాకెట్‌ అనుసంధానం పూర్తి చేశారు. ప్రయోగవేదికకు రాకెట్‌ను అనుసంధానం చేశారు. ప్రస్తుతం లెవెల్‌–2 తనిఖీలు చేస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 సిరీస్‌లో ఇది 20వ ప్రయోగం. దేశంలో నావిగేషన్‌ వ్యవస్థ అభివృద్ధికి ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు రోదసీలో పనిచే స్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. – సూళ్లూరుపేట

షార్‌లోని రెండో ప్రయోగవేదికపై సిద్ధంగా జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–18 రాకెట్‌(ఇన్‌సెట్‌) రాకెట్‌కు మూడోదశలో క్రయోజనిక్‌ దశను అమర్చుతున్న దృశ్యం, రాకెట్‌ శిఖర భాగాన 2,232 కిలోల నావిక్‌–03 ఉపహ్రాన్ని అమర్చుతున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement