పెళ్లకూరు : పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి ప్రభావతమ్మ, చింతలపూడికి చెందిన సాగి జితేంద్ర నామినేషన్లు వేశారు. చంద్రబాబు ప్రభుత్వం సత్యనారాయణరెడ్డిని తీవ్రంగా వేధింపులకు గురిచేస్తోంది. పలు అక్రమ కేసులు సమోదు చేసి 97రోజులు నెల్లూరు సబ్ జైలులో నిర్భంధించింది. అలాగే రెండో పర్యాయం అక్రమ కేసులు పెట్టి నెల్లూరు సబ్ జైల్లో రిమాండ్‌కు తరలించింది. అయితే కేంద్ర కారాగారంలో ఉన్నప్పటికి పార్టీ కోసం, ప్రజాసేవ కోసం తన అనుచరుల సహకారంతో పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానానికి సత్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేయడం విశేషం. అలాగే తన సతీమణి ప్రభావతమ్మతో పాటు అనుచరుడు జితేంద్రతో కూడా నామినేషన్ వేయించారు. అన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి.


