బాబు పాలనలో తుపాకీల రాజ్యం | - | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో తుపాకీల రాజ్యం

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

తిరుపతి మంగళం : చంద్రబాబు పాలనలో తుపాకీలే రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్‌సీపీ కర్నూ లు, నంద్యాల జిల్లాల రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు, దాడులు చేసినా, చివరికి తుపాకీతో గాల్లో కాల్పులు జరిపినా చంద్రబాబు, లోకేష్‌లు సమర్థించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో నామినేషన్లు వేయడానికి వెళ్లినప్పుడు జరిగిన ఘర్షణలో టీడీపీ రాష్ట్ర నాయకుడు, లోకేష్‌కి అత్యంత సన్నిహితుడైన కోడూరు బాలసుబ్రమణ్యం తుపాకీతో గాల్లో కాల్పులు జరపడం దేశమంతా చూసిందన్నారు. 2024లో లైసెన్స్‌ తుపాకీలను అందరి దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, కోడూరు బాలసుబ్రమణ్యం నుంచి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దీంతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా అరాచకాలకు తెగబడుతున్నారని విమర్శించారు. మూడేళ్లుగా బాలసుబ్రమణ్యం నుంచి ఎందుకు తుపాకీని స్వాధీనం చేసుకోలేదో పోలీసులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గాల్లో కాల్పులు జరిపిన్పటికీ అరెస్ట్‌ చేయకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఖాకీ చొక్కాలు ధరించిన పచ్చనేతలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోడూరు బాలసుబ్రమణ్యం దగ్గర నుంచి తుపాకీని స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ఈస్ట్‌ సీఐ శ్రీనివాసులుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో రిగ్గింగ్‌లు చేయాలనే కుట్రలు, కుతంత్రాలకు యత్నిస్తున్నారని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement