పింఛన్ల దరఖాస్తుకు నేటితో ఆఖరు | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల దరఖాస్తుకు నేటితో ఆఖరు

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

● ఇప్పటివరకు 41,260 మంది దరఖాస్తు ● గడుపు పెంచాలని పలువురు డిమాండ్‌

తిరుపతి అర్బన్‌: ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏడాదికి రెండు సార్లు ( 6 నెలలకు ఒకసారి) కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చారు. పింఛన్ల జారీకి సంబందించి దశాబద్దాలుగా ఇదే తంతు కొనసాగుతుంది. అయితే చంద్రబాబు సర్కార్‌ 2024 జూలై 12న కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లకు చాన్స్‌ ఇవ్వలేదు. 27 నెలలు తర్వాత తాజాగా ఈనెల 7 నుంచి 16వ తేది వరకు కొత్త పింఛన్ల దరఖాస్తులు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే 12,13,14 తేదీల్లో సెలువులు రావడంతో కేవలం 7 రోజులు మాత్రమే గ్రామ, వార్డు సచివాల యాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తక్కువ సమయం ఇచ్చారంటూ పలువురు గగ్గొలు పెడుతున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. అయితే ఇప్పటి( మంగళవారం) వరకు 41,260 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. బుధవారంతో దరఖాస్తుకు గడువు ముగుస్తోంది. దాదాపుగా ఇంకా 19 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని తెలుస్తుంది. ఒక్క రోజులో వీరందరు దరఖాస్తులు చేసుకోవడం సాధ్యంకాదని పలువురు ఆందోళన చెందుతున్నారు.

కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఇలా...

వృద్ధాప్య పింఛన్‌కు 22,411 మంది

వితంతువులుు 10,482

వికలాంగులు 4,369

డప్పు కళాకారులు 1881

నేత కార్మికులు 657

చర్మకారులు 533

కల్లుగీత కార్మికుల 374

ఫిషర్స్‌ మెన్స్‌ 308

ఒంటరి మహిళలు 221

ట్రాన్స్‌జెండర్స్‌ 24 మంది

మొత్తం 41,260 మంది

దరఖాస్తులు చేసుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement