మాట్లాడుతున్న ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాని ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నీట్ ఆదేశాల మేరకు నూతన ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులకు అవగాహన, ఓరింటేషన్ తరగతులు 15 రోజులు పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. కళాశాలలో ఎంబీబీఎస్ వైద్య విద్యతో పాటు, పరిశోధనలకు పెద్దపీట వేస్తామన్నారు. ఎస్వీ వైద్య కళాశాల ఆల్ ఇండియా ర్యాంకింగ్‌లో 69వ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ స్థానం ఎస్వీ వైద్య కళాశాలకు ఇవ్వడం గర్వకారణమన్నారు.


