నేడు వెంకటగిరి పోలేరమ్మ జాతర చాటింపు | - | Sakshi
Sakshi News home page

నేడు వెంకటగిరి పోలేరమ్మ జాతర చాటింపు

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

సైదాపురం/వెంకటగిరి రూరల్‌: వెంకటగిరి శక్తిస్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు ఏట్లు పూర్తయ్యాయి. నేడు జాతర చాటింపుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. బుధవారం వెంకటగిరి రాజాల నుంచి తాంబులాలు పుచ్చుకొని రాజర నిర్వహణకు అనుమతి తీసుకొని జాతరకు సంబంఽధించి తొలి చాటింపు వేయనున్నారు. 23 రెండో చాటింపు, 27 ఘటోత్సవం, 30 అమ్మవారి నిలుపు, అక్టోబర్‌ 1న అమ్మవారి సాగనంపు జరగనుంది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

తాంబూలం స్వీకరణ నేడు

ప్రతి ఏటా వెంకటగిరిలో జరగనున్న పోలేరమ్మతల్లి జాతరకు సంబంఽధించి వెంకటగిరి రాజా కుటుంబీకుల వద్ద నుంచి అమ్మవారి సేవకులు, రెడ్డి పెత్తందారలకు రాజా ప్యాలెస్‌లోని బొడ్డిచావిడి వద్ద దేవదాయశాఖ అధికారుల సమక్షంలో జాతర నిర్వహణకు తాంబూలం స్వీకరించనున్నారు. అనంతరం జాతరకు సంబంధించి మొదటి చాటింపు అదేరోజు అర్ధరాత్రి వేస్తారు. దీంతో వెంకటగిరిలో అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement