బ్రహ్మోత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌

Sep 10 2026 3:32 AM | Updated on Sep 10 2026 3:32 AM

● సరిదిద్దుకోవడానికి తంటాలు ● జేసీ లాగిన్‌కి వెళ్లి మార్పు చేసుకోవడానికి రెండు నెలలు? ● పింఛను దరఖాస్తుకు ఈనెల 16 వరకే గడువు ● ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు – 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

పైసలిస్తేనే ఫైళ్లు కదిలేది!
సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఏదైనా ఫైలు కదలాలంటే సిబ్బందికి ముడుపులు చెల్లించాల్సిందే.
పుస్తకాలతో స్నేహం చేయించాలి
విద్యార్థులను మొబైల్‌కు దూరంచేసి పుస్తకాల తో స్నేహం చేసేలా మార్చాలని డీఈవో ఉపాధ్యాయులకు సూచించారు.

సర్టిఫికెట్లలో కూలాలు మారిపోతున్నాయి

ఉద్యోగులు చేసిన తప్పులకు ప్రజలకు అవస్థలు

గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

పుట్టింది ఓ కులం.. ధ్రువీకరణపత్రంలో మరోకులం. పింఛన్‌కు అర్జీ ఇవ్వాలంటే కుదరదు. సంక్షేమ పథకంలో లబ్ధిపొందాలంచే వీలుకాదు.. చివరికి తానను తానే అని నిరూపించుకోవాలన్నా.. సాధ్యంకావడం లేదు. ఇందంతా ఏ ఒక్కరి సమస్యో కాదు.. అధికారులు తప్పుల తడకగా కుల ధ్రువీకరణ పత్రాలివ్వడం వల్ల జిల్లా వ్యాప్తంగా వందలాది మంది పడుతున్న నరకయాతన. ఇక కులధ్రువీకరణం పత్రం సవరణ కోసం.. వారు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో వీఆర్‌ఓ, తహసీల్దార్‌, ఆర్డీఓ సహా చివరికి జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకూ సగటున రెండు నెలలకు పైగా కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో పేరెన్నికగన్న కపట కూటమి ప్రభుత్వం ఈనెల 16 వరకే అర్జీలు స్వీకరిస్తామని హుకుం జారీ చేయడంతో.. అర్హులంతా.. హలో లక్షణా.. హథవిథీ అంటూ సకాలంలో దరఖాస్తులందజేయలేక.. అల్లాడిపోతున్నారు. వీరి పట్టించుకునే నాథుడుకానీ.. సమస్యను పరిష్కరించే నాయకుడు గానీ ప్రభుత్వంలో కనిపించడం లేదంటే అతిశయోక్తికాదు.

ఇంకా ఎంత కాలం తిరగాలో?

మా కులం ఈడిగ (బీసీ–బీ). అయితే రెండు నెలల క్రితం మా పిల్లలు మా పాఠశాలలో చేర్పించడానికి కులధృవీకరణ పత్రం కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. అయితే వారు మా కులం ఈడిగ కాకుండా ఆన్‌లైన్‌లో జంగమ (బీసీ–బీ) అని ఉందని అలా ఇస్తామని లేదంటే జాయింట్‌ కలెక్టర్‌ లాగిన్‌లో మార్పు చేయించుకోవాలని చెప్పారు. దీంతో రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. నా తోపాటు మా భర్త, మా ఇద్దరు పిల్లల కులం కూడా జంగమ గా మారిపోయింది. ఇప్పటికే రెండు నెలలు నుంచి తిరుగుతున్నాం. ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియడం లేదు. – భువనేశ్వరి,

పాండూరు గ్రామం, వరదయ్యపాళెం మండలం

ఇంతమంది వద్దకు తిరగాలా?

మా కమ్యూనిటీ రెడ్డి (ఓసీ), అయితే కమ్మ (ఓసీ)గా మారిపోయింది. ఆ తర్వాత వీఆర్వో నుంచి తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ సీ సెక్షన్‌, డీఆర్వో, జాయింట్‌ కలెక్టర్‌ ఇంతమంది అధికారుల పర్యవేక్షణ అనంతరం ఎట్టకేలకు కమ్యూనిటీని మార్పు చేయించుకున్నాం. క్షేత్రస్థాయి నుంచి జాయింట్‌ కలెక్టర్‌ వరకు ఆరుగురు అధికారుల వద్దకు వెళ్లి తప్పుగా పడిన కమ్యూనిటీని మార్పు చేసుకోవడానికి నానా తంటాలు పడ్డాం. ఎక్కడ పొరపాటు జరిగిందే గానీ తహసీల్దార్‌ పరిధిలోనే తప్పును సవరిస్తే కాస్తా ఇబ్బందులు తప్పుతాయని అంతా భావిస్తున్నాం. – రత్నం, శ్రీకాళహస్తి మండలం

బీసీ(ఏ) అయితే బీసీ(డీ)గా మార్చేశారు

మా కమ్యూనిటీ బీసీ(ఏ) అయితే బీసీ(డీగా మా కుమార్తె సర్టిఫికేట్‌లో మా ర్పుచేశారు. బీసీ ఏ అయితే ఇంజినీరింగ్‌లో మంచి కాలే జ్‌లో సీటు వస్తుంది. అయి తే బీసీ డీ అయితే సీటు రాదు. దాంతో కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను మార్పు చేసుకోవడానికి అధికారుల చుట్టు తిరుగుతున్నాను. ఇలా ఎందుకు జరిగిందో తెలియం లేదు. చాలామంది తమ పిల్లల సర్టి ఫికెట్స్‌ కోసం సచివాలయంకు వెళితే కమ్యూనిటీ మారిపోయినట్లు చెబుతున్నారు.

– జయరాం, ఏర్పేడు మండలం

తిరుపతి అర్బన్‌: పిల్లల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి పలువురు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందడానికి సచివాలయాలకు వెళుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో వారి కులం మారిపోయి ఉండడంతో లబోదిబోమంటూ వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులు మాత్రం జేసీ లాగిన్‌లో మార్పు చేసుకోండి అంటూ సలహాలు ఇచ్చేస్తున్నారు. మార్పు చేయడానికి వీఆర్వో వద్ద నుంచి మొదలుపెట్టి తహసీల్దార్‌, తర్వాత ఆర్డీవో, అక్కడి నుంచి కలెక్టరేట్‌ సీ–సెక్షన్‌కు ఆ తర్వాత డీఆర్వో నుంచి జాయింట్‌ కలెక్టర్‌ లాగిన్‌కు ఫైల్‌ వెళ్లాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పేదలకు నెల నుంచి రెండు నెలల సమయం పడుతోంది. దీంతో పేద, సామాన్య, మధ్య తరగతికి చెందిన వారు అల్లాడిపోతున్నారు. తప్పులను తహసీల్దార్‌ పరిధిలో సవరిస్తే అందరికి అనుకూలంగా ఉండేదని ఆవేదన చెందుతున్నారు.

ఎన్నో అవస్థలు

కొందరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎస్సీలుగా మారిపోవడంతో వారు పింఛను దరఖాస్తులు చేసుకోలేకవాపోతున్నారు. ఎస్టీలకు 50ఏళ్లకు పింఛనుకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది. ఎస్సీలు అయితే 60ఏళ్లకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఎస్టీలకు ఆన్‌లైన్‌లో ఎస్సీలుగా కమ్యూనిటీ మారిపోయి ఉండడంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాన్ని గుర్తించి తహసీల్దార్‌ పరిధిలోనే కులధ్రువీకరణలో చోటుచేసుకున్న పొరబాట్లుకు పరిష్కారం చూపాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

30 నుంచి 40 రోజులు

సర్టిఫికెట్లలో సవరణలకు ఆరుగురు అధికారులు.. పర్యవేక్షణ చేసి అప్రూవల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ వారంతా తప్పులతో ఉన్న పాత సర్టిఫికెట్‌ను రిజెక్ట్‌ కొట్టాల్సి ఉంది. అనంతరం కొత్తగా తప్పులు లేకుండా సచివాలయంలో సర్టిఫికెట్లకు దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రతిరోజూ అధికారుల చుట్టూ తిరిగినా కనీసం.. సర్టిఫికెట్‌ను సవరించుకోవడానికి 30 నుంచి 40 రోజుల సమయం పడుతోంది. ఈ ప్రభుత్వంలో తహసీల్దార్‌కు, ఆర్డీవోకు పూర్తి అధికారాలు ఇచ్చేశామంటూ ఏడాదిగా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. చిన్నపాటి సర్టిఫికెట్‌లో పొరబాటు ను సవరించడానికి తహసీల్దార్‌కు, ఆర్డీవోకు పవర్‌ లేదు.. జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. దీంతో పలువురు మండిపడుతున్నారు.

– జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్‌

తిరుపతి మంగళం:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా ల్లో నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వాహనాలు నడిపితే అలాంటి వాహనాలను సీజ్‌ చేస్తామని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్‌ హెచ్చరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం తిరుమల ఘాట్‌ రోడ్డులో రవాణా, పోలీస్‌ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తు లు తిరుమలకు విచ్చేస్తుంటారని, వారిని సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చే బాధ్యత ట్యాక్సీ వాహనదారులపై ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి వాహనాలను సీజ్‌చేసి జరిమానా విధించి, ఆ వాహనాలను తిరుమలకు వెళ్లకుండా నిషేధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ప్రతి వాహనదారుడు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో ఎంవీఐ, వెంకటరమణ నాయక్‌, ఎ ఎంవీఐ ప్రసాద్‌ వర్మ, ట్రాఫిక్‌ ఎస్‌ఐ , పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కులం మార్పు చేశారు.. పింఛన్‌ కోల్పోతున్నా

ఎస్టీలకు 50 ఏళ్లు నిండితే వృద్ధాప్య పింఛనుకు వర్తిస్తుంది. నాకు 51 ఏళ్లు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వెళ్లాను. సచివాలయ ఉద్యోగులు ఆన్‌లైన్‌లో నా కులం ఎస్సీగా ఉందని చెప్పారు. ఎస్సీలకు 60ఏళ్లు నిండి ఉంటేనే పింఛన్‌ వస్తుందని చెబుతున్నారు. నేను ఎస్సీ కాదు ఎస్టీ అంటూ మొత్తుకున్నాను. వారు జాయింట్‌ కలెక్టర్‌ లాగిన్‌కి వెళ్లి కమ్యూనిటీని మార్పు చేసుకుని వస్తే.. దరఖాస్తు చేస్తామని చెబుతున్నారు. మార్పు చేసుకోవాలంటే రెండు నెలలు సమయం పడుతుందని అంతా చెబుతున్నారు. అయితే ఈ నెల 16 వరకు మాత్రమే పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇచ్చారు. నాకు న్యాయం చేయండి స్వామీ. – గంగయ్య,

వెన్నలకంటి రాఘవయ్య ఎస్టీకాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement