– 8లో
– 8లో
తిరుపతి శివారులోని టీటీడీ గోశాలలో గోకులాష్టమి వేడుకలు టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు.
ఉజ్వల భవితకు పునాది
విద్యారంగంలో విశేష సేవలందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.. తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎస్‌పీజేఎన్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ఫిజిక్స్ టీచర్ మహాలక్ష్మి. ఈమె విద్యాబోధనలో తనదైన ముద్ర వేస్తున్నారు. కోవిడ్ కష్టకాలంలో జూమ్‌లో డిజిటల్ తరగతులు నిర్వహించడం, తోటి ఉపాధ్యాయులకు తరగతి గదిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై, మెగా డీఎస్సీ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఆదర్శ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈమె సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై నేడు సత్కారం అందుకోనున్నారు.


