తిరుపతి తుడా: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ ప్రమీలాదేవి పర్వేక్షణలో మొలకలచెరువు గ్రామానికి చెందిన మౌలాబీ (54) అనే మహిళకు క్లిష్టమైన సర్వికల్ ఫైబ్రాయిడ్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. సూపరింటెండెంట్ మట్లాడుతూ గర్భాశయ ముఖద్వారంలో ఏర్పడే ఫైబ్రాయిడ్‌ల శస్త్రచికిత్స సవాలుతో కూడుకున్నదని, వైద్య బృందం సమన్వయంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రోగి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని తెలిపారు.


