గగనతలంలో.. విజయోత్సాహం | - | Sakshi
Sakshi News home page

గగనతలంలో.. విజయోత్సాహం

Sep 5 2026 7:13 AM | Updated on Sep 5 2026 7:13 AM

– 8లో

విజయోత్సాహంతో ఇస్రో దూసుకుపోతోంది. ఆకాశమే హద్దుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది.

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు

తెలుగు వెలుగు వార ధి

పేద బిడ్డల సారధి

వెంకటగిరి రూరల్‌: పేద బిడ్డల ఉజ్వల భవితకు పునాది వేస్తున్నారు ఉపాధ్యాయురాలు అద్దంకి విజయలక్ష్మి. వెంకటగిరి పట్టణంలోని రాణిపేట ఎపీపీ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఆమె విద్యార్థుల ఉన్నతికి తనవంతు కృషి చేస్తున్నారు. వినూత్న పద్ధతులతో బోధన చేస్తూ ఆదర్శవంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. సామాజిక బాధ్యత, మానవత విలువతో కూడిన విద్యనందించడం తన జీవిత లక్ష్యమని, ఈ సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా తనను ఎంపిక చేయడం మరింత బాధ్యత పెంచిందని చెబుతున్నారు.

బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కల్లివెట్టు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యువశ్రీ మురళి తెలుగుభాష వికాసానికి తనవంతు కృషి చేస్తున్నారు. పలు సాహిత్య రచనలు, కవితలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. సాంకేతిక రంగంలో సైతం తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించాలనే ఆశయంతో ఇంటర్‌నెట్‌లో జైతెలుగు తల్లి డాట్‌ కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ను జై తెలుగు తల్లి యువశ్రీ మురళి పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించారు. తెలుగు భాషా ప్రగతికి తన వంతు కృషి చేస్తున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా నేడు విజయవాడలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement