అజ్ఞానమనే చీకటిని పారదోలి.. విజ్ఞానమనే వెలుగులు
నింపుతారు. తండ్రిలా ఆదరిస్తారు. తల్లిలా లాలిస్తారు.
విద్యాబుద్ధులు నేర్పి నవసమాజ స్థాపకులుగా తీర్చిదిద్దుతారు. తాను కరిగిపోతూ పది మందికీ వెలుగునిచ్చే కాంతిరేఖలా
నిలుస్తారు. అందుకే తల్లిదండ్రి తర్వాత పూర్వీకులు గురువుకు అంత గొప్ప ప్రాధాన్యత నిచ్చారు. భావిభాతర పౌరులను తీర్చిదిద్దడంలో వారే అందరికన్నా ముందుంటారు. ఎందరో
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం నిర్వహిస్తుంటారు. తమ ఉన్నతికి బాటలు వేసిన ఉపాధ్యాయులను మనసారా స్మరించుకుంటూ.. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకుని సర్వోత్తములుగా నిలిచిన నవసమాజ నిర్మాతల విజయగాధలను ఒకసారి నెమరు వేసుకుందాం. నేడు గురుపూజోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..


