బ్రహ్మోత్సవాలకు కండిషన్‌ బస్సులు | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు కండిషన్‌ బస్సులు

Sep 3 2026 8:35 AM | Updated on Sep 3 2026 8:35 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సాంకేతిక సమస్య లేని కండిషన్‌లో ఉన్న బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం తిరుపతిలోని డీపీటీఓ కార్యాలయంలో విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయి తనిఖీ నిర్వహించిన తర్వాతనే సర్వీసులకు అనుమతిస్తామన్నారు. శ్రీవారి భక్తులకు మెరుగైన ప్రయాణ సేవలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రధాన కార్యాలయం నుంచి విచ్చేసిన సీఎంఈలు కె.వెంకటరావు, కె,చద్రశేఖర్‌ తమ సాంకేతిక బృందాలతో కలసి వాహన తయారీదారులు ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ చేపట్టిన వాహనాల మరమ్మతులు, నిర్వహణ స్ధితిగతులను నిశితంగా పరిశీలించారు. ఐదు దశల నిర్వహణ తరువాత వాహనాల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ బాలాజీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement