చంద్రగిరి: కిసాన్ క్రెడిట్ కార్డ్, ఎంఎస్‌ఎంఈ, ప్రభుత్వ పథకాలు, రిటైల్ రంగాల్లో రుణాల పంపిణీని వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు(ఏపీజీబీ) చైర్మన్ ప్రమోద్‌కుమార్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం తిరుచానూరులోని ఆ బ్యాంకు శాఖలో రీజియన్ బ్యాంక్ మేనేజర్ల సమావేశం నిర్వహించారు. బ్యాంకు బలమైన ఆర్థిక స్థితిని ఆయన గుర్తుచేస్తూ రాష్ట్రంలోనే డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అందిస్తోందన్నారు. జులై 31 నాటికి బ్యాంకు మొత్తం రూ.1.42 లక్షల కోట్ల వ్యాపారం జరిపిందని వివరించారు. ఈ సందర్భంగా డిజిటిల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడం, ఖాతాదారుల సౌకర్యార్థం తిరుచానూరు శాఖలో ఫేస్ పే కియోస్కోను ఆయన ప్రారంభించారు. అదే విధంగా బాకు అందిస్తున్న వివిధ రకాల ఉత్పత్తులు, సేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.


