తిరుపతి కార్పొరేషన్‌లో ఏసీబీ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

తిరుపతి కార్పొరేషన్‌లో ఏసీబీ తనిఖీలు

Mar 11 2026 9:00 AM | Updated on Mar 11 2026 9:00 AM

● టౌన్‌ ప్లానింగ్‌లో పలు దస్త్రాలు స్వాధీనం ● అధికారుల వద్ద రూ.30 వేల నగదు గుర్తింపు

తిరుపతి తుడా: మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఏసీబీ ఏఎస్పీ విమల కుమా రి నేతృత్వంలో మంగళవారం సుదీర్ఘంగా తనిఖీలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఈ మేరకు ఏసీబీ అధికారులు మూ కుమ్మడి దాడులు నిర్వహించారు. బీపీఎస్‌కు సంబంధించి కొంతమంది టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఫిర్యాదు లు చేశారు. వాటి ఆధారంగా ఏసీబీ సోదాలు చేపట్టా రు. అధికారుల వద్ద రూ.30 వేలు నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలానే బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటనలకు సంబంధించిన పలు కీలక దస్త్రాలను సీజ్‌ చేశారు. ఫైళ్ల తనిఖీలను రాత్రి వరకు కొనసాగించారు. మరో రెండు రోజులపాటు టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోని పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, స్వాధీనం చేసుకోనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

రూ. 30వేలు నగదు స్వాధీనం

ఏసీబీ సోదాల నేపథ్యంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోని అధికారులు, సిబ్బంది నుంచి రూ.30 వేల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగతంగా టేబుల్‌ డ్రాల్లో తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద నుంచి కొంత మేర నగదు ఉండడాన్ని గుర్తించారు. అందరి దగ్గర నుంచి మొత్తంగా రూ. 30వేలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. సుమారు 30కి పైగా ఫైళ్లను సీజ్‌ చేసి, ప్రధాన హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ కోసం దరఖాస్తులు చేసి ఇప్పటి వరకు అనుమతులు రాని సుమారు 12 మందికిపైగా బాధితులను విచారించి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు.

మరో రెండు రోజుల పాటు సోదాలు

ఏసీబీ ఏఎస్‌పీ విమల కుమారి మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్‌లో బీపీ ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతుల విషయంలో పలు ఫి ర్యాదులు అందాయని తెలిపారు. ఈ మేరకు మంగళవారం టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో సోదాలు చేసి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మ రో రెండు రోజులు తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement