2,591మంది విద్యార్థినులకు యూజీ, పీజీ, పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం 99 మందికి పసిడి పతకాలు, బుక్, నగదు బహుమతులు చాన్సలర్ హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఆకట్టుకున్న గవర్నర్ ప్రసంగం
స్నాతకోత్సవంలో భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థినులనుద్ధేశించి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అనంతరం డీఆర్‌డీఓ విశ్రాంత సైంటిస్ట్ డాక్టర్ శశికళ సిన్హా దేశానికి చేసిన సేవలను అభినందిస్తూ, ఆమె బాటలో ప్రతి విద్యార్థిని నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆమెకు వర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
తిరుపతి సిటీ: శ్రీపద్మావతి మహిళావర్సిటీ 22వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. శనివారం వర్సిటీలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఆర్‌డీఓ విశ్రాంత సైంటిస్ట్ డాక్టర్ శశికళ సిన్హాను వర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సన్మానించింది. ఈ కార్యక్రమానికి వీసీ ప్రొఫెసర్ ఉమ అధ్యక్షత వహించి వర్సిటీలో విద్యాప్రమాణాలు, సాధించిన విజయాలపై, జరుగుతున్న పరిశోధనలపై ప్రసంగించారు. మహిళా సంఘాలు, యువతతో కలిసి పర్యావరణ అవగాహన, ఆరోగ్యం, డిజిటల్ లిటరసీ, సహజ వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
99మందికి పసిడి పతకాలు..
2,591మందికి పట్టాలు
స్నాతకోత్సవంలో భాగంగా వర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థినులకు గవర్నర్, సైంటిస్ట్ శశికళ సిన్హా చేతుల మీదుగా పట్టాలను ప్రదానం చేశారు. ఇందులో 121 మంది పీహెచ్‌డీ పట్టాలు పొందగా, ఇందులో రాష్ట్ర సమాచార కమిషనర్ రెహానా బేగం సైతం గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అకడమిక్ విద్యలో ప్రతిభ కనబరిచిన 99 విద్యా ర్థినులకు గోల్డ్ మెడళ్లు, ఇద్దరికి సిల్వర్ మెడళ్లతో పాటు 23 మందికి బుక్, ఏడుగురికి నగదు బహుమతులు అందజేశారు. ఇందులో విద్యార్థిని సుమాంజలి పలు విభాగాల్లో ప్రతిభ చూపి ఏకంగా మూడు గోల్డ్‌మెడళ్లను అందుకోవడం విశేషం.
ఘనంగా పద్మావతి మహిళా వర్సిటీ స్నాతకోత్సవం
నేటికీ సమాజంలో మహిళ వివక్ష బాధాకరం
డీఆర్‌డీఓ విశ్రాంత సైంటిస్ట్ డాక్టర్ శశికళ సిన్హా మా ట్లాడుతూ ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో మ హిళలు రాణిస్తున్నా, నేటికీ మహిళలు వివక్షకు గురవుతుండడం బాధకరమన్నారు. పలు సందర్భాల్లో మహిళలు పురుషుల కంటే రెండింతలు కష్టపడాల్సి వస్తుందని, ప్రతి మహిళ పుట్టుకతోనే ఆలోచించే, క లలుకనే, నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం అతిథులను వర్సిటీ అధికారులు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు.


