● భిన్న రంగాల్లో విజయాలు సాధిస్తున్న నారీమణులు ● నేడు మహిళాదినోత్సవం | - | Sakshi
Sakshi News home page

● భిన్న రంగాల్లో విజయాలు సాధిస్తున్న నారీమణులు ● నేడు మహిళాదినోత్సవం

Mar 8 2026 7:16 AM | Updated on Mar 8 2026 7:16 AM

● భిన్న రంగాల్లో విజయాలు సాధిస్తున్న నారీమణులు ● నేడు మహిళాదినోత్సవం

పురస్కారశశికళ

గణిత బోధనతోపాటు రచ యిత, కవియిత్రి, సాహిత్యవేత్త సమాజానికి ఎనలేని సేవలందించారామె. తెలుగు భాషా ఔన్నత్యానికి ఎంతో కృషి చేశారు. తెలుగు భాషలో పలు కవితలు రాశారు.. బహుముఖ ప్రజ్ఞ చూపారు అందుకే ఆమెకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పురస్కారాలు వరించాయి.. ఆమె ముత్తుకూరులోని బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాల అధ్యాపకురాలు తన్నీరు శశికళ. నాయుడుపేట పట్టణానికి చెందిన తన్నీరు శశికళ ముత్తుకూరులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకులంలో గణిత అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త వాయు గుండ్ల సురేష్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన్నీరు శశికళ విద్యార్థులకు విద్యాబోధనలో మెళకువలతోపాటు రచయిత, కవియిత్రి, సాహిత్యవేత్తగా జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుని మేటిగా రాణిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 28వ తేదీ తిరుపతిలో జరిగిన తెలుగుభాష అంతర్జాతీయ సదస్సులో తెలుగుభాషాభివృద్ధిపై శశికళ పత్ర సమరణ చేసి, ప్రశంసా పత్రం అందుకున్నారు. 2024లో సావిత్రభాయి పూలే నేషనల్‌ అవార్డు అందుకున్నారు. జాబిలి తునకలు, స్వర్ణముఖి సవ్వడులు తదితర కవితలపై 2023లో గిడుగు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆమె కవితలను సాక్షి ఫన్‌డే తదితర పత్రికల్లో ప్రచురితం చేశారు. కళశాలలో పిల్లలకు కథలు, కవితలపై శిక్షణ ఇవ్వడంలో మేటిగా రాణించడంతో అధ్యాపకురాలికి 2017, 2022లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలుగుభాషా సేవా సత్కారం ప్రదానం చేశారు. తెలుగు అసోసియేషన్‌ లండన్‌ వారి ఉగాది విశిష్ట సంచికలో శశికళ రచించిన మా తెలుగు 2024 పేరుతో కవితను ప్రచురించారు. బెంగళూరు, మధురై తదితర రాష్ట్రాలకు చెందిన అనేక యూనివర్సిటీల్లో తెలుగు రచనలు, కవితలకు పలు అవార్డులు అందుకున్నారు. అలాగే పలు రాష్ట్రాలకు చెందిన రచయితల సంఘం నుంచి కూడా ఆమె జాతీయ కవిత అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 2024లో ఆచార్యదేవోభవ జాతీయస్థాయి అవార్డు, కలాం విజన్‌ అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు. నెల్లూరులో పోతూరి మాణిక్యమ్మ స్ఫూర్తి అవార్డు, తిరుపతిలో గురు బ్రహ్మ అవార్డు, గణిత పరికరాల ప్రదర్శనలో ఎన్‌సీఈఆర్‌టీ వారు రాష్ట్రస్థాయిలో బహుమతి పొందారు. 2013, 2017లో ఆగస్టులో 15వ తేదీన ఉత్తమసేవా అవార్డులను అందుకున్నారు. 2015, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, 2017లో సావిత్రి బాయి పూలే అవార్డులను శశికళ తీసుకుని ఆదర్శంగా నిలిచిచారు.

Advertisement
 
Advertisement
Advertisement