విజయరూపిణి | - | Sakshi
Sakshi News home page

విజయరూపిణి

Mar 8 2026 7:16 AM | Updated on Mar 8 2026 7:16 AM

లక్ష్యాన్ని సాధించిన భాను

నాయుడుపేటటౌన్‌: స్థానిక ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న భానుప్రసన్న ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై ంది. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నేటితరం యువతకు ఆమె ఆదర్శంగా నిలిచింది. బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, జొన్నతాళి గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీనివాసరావు, గంగమ్మ దంపతుల పెద్ద కుమార్తె శివరాత్రి భానుప్రసన్న. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ప్రభుత్వ పాఠశాలలో చదివి కాకతీయ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. నర్సారావుపేట కృష్ణవేణి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చేసింది. పోలీస్‌ శాఖలో ఉద్యోగం సాధించాలన్న ఆమె కలను సాకారం చేసుకునేందుకు ఇంజినీరింగ్‌ చదువుతోనే కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. బీటెక్‌ పూర్తి చేశాక లక్ష్యాన్ని మరింతగా పెంచుకుని ఎస్‌ఐ కావాలన్న ప్రయత్నాలను ప్రారంభించింది. తన లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలన్న తపనతో భానుప్రసన్న అకుంఠిత దీక్షతో ఎస్‌ఐ పోటీ పరీక్షల్లో విజయం సాధించింది. మెరుగైన ర్యాంకుతో ఉద్యోగం సాధించి ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. నాయుడుపేటలోనే పీఎస్‌ఐగా ట్రైనింగ్‌ పొందిన ఆమె నాయుడుపేట అర్బన్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement