నేటి నుంచి బెంగళూరు–అలీపుర్దావార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: బెంగళూరు–అలీపుర్దువార్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. శనివారం బెంగళూరు నుంచి ఏపీ మీదుగా పశ్చిమబెంగాల్ అలీపుర్దువార్ వరకు వెళ్లనుంది. ఏపీలోని కుప్పం, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్త వలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వేస్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. దీంతో ఈ రూట్లల్లో ప్రయాణించేవారితో పాటు బెంగళూరు వెళ్లేవారికి ఈ రైలు బాగా ఉపయోగపడనుంది.


