ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్‌

Jan 22 2026 8:29 AM | Updated on Jan 22 2026 8:29 AM

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్‌

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్‌

తిరుపతి సిటీ: ఎన్‌టీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల్లో బుధవారం నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్స్‌ సెషన్‌–1 పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ఎన్‌టీఏ సిటీ కోఆర్డినేటర్‌ కై లాస్‌నాథ్‌ తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పరీక్షలకు 2,107 మంది హాజరు కావాల్సి ఉండగా 2,028 మంది హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయని చెప్పారు.

ఇంటర్‌ ఎథిక్స్‌ పరీక్ష ప్రశాంతం

తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు బుధవారం జరిగిన ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యా ల్యూస్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఆర్‌ఐఓ జి రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను జిల్లాలో 30,377మంది విద్యార్థు లు హాజరు కావాల్సి ఉండగా 29,989మంది హాజరైనట్లు తెలిపారు.

గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎస్‌

తిరుపతి రూరల్‌: నగరంలోని బ్లిస్‌ హోటల్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డిప్లొమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నిర్మించిన నూతన గెస్ట్‌ హౌస్‌ను రాష్ట్ర సీఎస్‌ విజయానంద్‌ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ శివశంకర్‌, పూర్వపు సీఎండీలు కలాల రంగనాథం, పి.గోపాల్‌రెడ్డి, డిప్లొమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ముఖ్య సలహాదారు సుబ్బారావు, కేవీ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement