అర్ధరాత్రి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటేమిటీ?
రాపూరు: మండలకేంద్రంలోని మద్దెలమడుగు సెంటర్‌లో అర్ధరాత్రి పైలాన్ ఉన్న స్థూపం వద్ద దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేయడం ఏమిటని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి ప్రశ్నించారు. స్థానిక బాలాజీ కల్యాణ మండపం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడారు. 2009లో సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ శంకుస్థాపనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మండల కేంద్రంలో పైలాన్ ప్రారంభించారని, ఆయన గుర్తుగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు అ ప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాణరెడ్డి పైలాన్‌ను తొలగించి, దాని స్థానంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్య లు చేపట్టారని, అయితే జాతీయ రహదారిపై పెట్ట వచ్చా? లేదా అని కొంత మీమాంస చోటు చేసుకోవడం, అనంతరం జరిగిన రాజకీయపరిణామాలతో వైఎస్సార్ విగ్రహ స్థాపన వాయిదా పడిందన్నారు. అయితే పైలాన్ ఉన్న స్థానంలో ఎన్‌టీఆర్ విగ్రహాన్ని అర్థరాత్రి స్థాపించడం ఏమిటని, మరో చోటపెట్టవచ్చు కదా అని నిలదీశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, రాత్రికి రాత్రి విగ్రహం ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ విషయపై జిల్లా నాయకులతో చర్చించి, వారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళాతామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఖాదర్‌బాషా, రైతు సంఘం నాయకులు పిచ్చిరెడ్డి, కోటేశ్వరరెడ్డి, రాపూరు మండల ఉపాధ్యక్షులు గౌస్‌పీర్, కార్యదర్శి డీవీ రమణయ్య, నాయకులు ఏటూరు మురళీమోహన్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకటసుబ్బయ్య, డ మ్మాయి రమణయ్య పాల్గొన్నారు.


