సేద్యానికి జీరామ్..రామ్
వ్యవసాయ పనులకు వేధిస్తున్న
కూలీల కొరత
2014 నుంచి అమలుకు నోచని అనుసంధానం హామీ
అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు
గ్రామీణ్–వీబీ జీరామ్‌జీ అన్ని రంగాలకు అనుసంధానం చేస్తామని ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. దీంతో వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తోంది. ఫలితంగా మట్టి మనుషులకు పెట్టుబడులు పెరగడంతోపాటు ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక్కట్లు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది.
సైదాపురం: ఉపాఽధిహామీ (గ్రామీణ్–వీబీ జీరామ్‌జీ ) పథకాన్ని వ్యవసాయనికి అనుసంఽధించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నయే తప్ప అమలు చేయడంలో మాత్రం విఫలమవుతున్నాయి. కూలీలు ఎక్కువగా ఉపాధిహామీ పథకం పనులకు వెళుతుండడంతో వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడుతుంది. దీంతో కూలి పెరగడంతో పాటు సకాలంలో వ్యవసాయ పనులు పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 34 మండలాల్లో 2.66 లక్షల జాబ్‌కార్డులు ఉండగా 2,.2 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. అందులో రోజు సుమారు లక్ష మంది వరకు(గ్రామీణ్–వీబీ జీరామ్‌జీ) ఉపాధి పనులకు వెళుతున్నారు. దీంతో వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడుతోంది. యంత్ర పరికరాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా చాలా పనులు కూలీల ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఉపాఽధిహామీ పథకాన్ని వ్యవసాయనికి అనుసంధానం చేస్తే రైతులకు ఊరట కలుగుతుంది. రైతులపై కూలీల ఖర్చు భారం కూడా కాస్త తగ్గుతుంది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉపాఽధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామని హమీ ఇచ్చి విస్మరించింది. ప్రస్తుతం బీజేపీ, జనసేనతో కలసి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకో ఆ హామీలను అమలు చేసే దిశగా ముందుకు వెళ్లడం లేదు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. రైతులు వారి స్తోమతకు మించి మెట్ట ప్రాంతాల్లో బీడు భూములు ఉండకూడదని వ్యవసాయం చేస్తుంటారు. అందులో వచ్చిన ఆదాయంతో జీవనం సాగిద్దామనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో తరచూ నష్టాలే మిగులుతున్నాయి. వరి, వేరుశనగ, సాగు చేస్తున్న రైతులు విత్తనాలు చల్లడం, కోతలు, నూర్పిళ్లు తదితర పనులకు ఎకరా సాగుకు దాదాపు రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు ఖర్చులు భరించాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేస్తే కూలీల కొరత తీరడంతోపాటు పెట్టుబడి కూడా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని రైతాంగం కోరుతుంది.
ఉపాధి(గ్రామీణ్–వీబీ జీరామ్‌జీ) పనులకు వెళ్తున్న కూలీలు
కష్టాలను గుర్తించాలి
ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి ఉపాధి హామీ(గ్రామీణ్–వీబీ జీరామ్‌జీ )పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలి. అలా చేస్తే రైతులతోపాటు కూలీలకు కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయంలో కనీసం పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు.
– ఏడుకొండలు తిప్పిరెడ్డిపల్లి,
వెంకటగిరి నియోజకవర్గం
అప్పుల పాలవుతున్నాం
రైతులకు పంటల సాగు భారంగా మారింది. వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడులు కూడా దక్కడంలేదు. పెట్టిన ఖర్చులు కూడా రాకపోగా అప్పుల పాలవుతున్నాం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయనికి అనుసంధానం చేయాలి. అప్పుడే కూలీల భారం తగ్గుతుంది.
–రామ్‌గోపాల్‌రెడ్డి గులించెర్ల,
వెంకటగిరి నియోజకవర్గం
రైతులకు ప్రయోజనం
ఉపాఽధిహామీ (గ్రామీణ్–వీబీ జీరామ్‌జీ )పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పంట సాగు రైతులకు భారంగా మారుతుంది. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిపంటలు సాగు చేస్తున్నప్పటికీ లాభాలు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. లేదంటే రైతులు వీధుల పాలవుతారు. – వరప్రసాద్‌రాజు, లింగసముద్రం,
వెంకటగిరి నియోజకవర్గం
సేద్యానికి జీరామ్..రామ్
సేద్యానికి జీరామ్..రామ్
సేద్యానికి జీరామ్..రామ్
సేద్యానికి జీరామ్..రామ్


