శుకబ్రహ్మాశ్రమంలో విశేష హోమపూజలు | - | Sakshi
Sakshi News home page

శుకబ్రహ్మాశ్రమంలో విశేష హోమపూజలు

Jan 21 2026 7:33 AM | Updated on Jan 21 2026 7:33 AM

శుకబ్

శుకబ్రహ్మాశ్రమంలో విశేష హోమపూజలు

● నేటి నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఎథిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్షలు ● ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంటర్‌ పాస్‌ సర్టిఫికెట్‌ ● ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి

శ్రీకాళహస్తి: పట్టణంలోని శుకబ్రహ్మాశ్రమంలో మంగళవారం దివ్య దినోత్సవం శాస్త్రోకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి విద్యాస్వరూపానందగిరిస్వామి మాట్లాడుతూ శుకబ్రహ్మాశ్రమం 1950లో సద్గురు మళయాళ స్వామి చేతుల మీదుగా ప్రారంభించిందన్నా రు. ఆశ్రమ ప్రారంభదినాన్ని పురస్కరించు కుని పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మలయాళస్వామి, విద్యాప్రకాశనందగిరి స్వామి చిత్రపటాలకు విశేష పూజలు, హోమ పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఎన్‌ఎస్‌యూలో సంస్కృత బోధనపై జాతీయ సదస్సు

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో భారతీయ భాషా సమితి, నవదేహలి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సంస్కృత భాషలోనే సంస్కృత బోధన అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం వర్సిటీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, సంస్కృత భారతి సంస్థ అఖిల భారతీయ ప్రశిక్షణ ప్రముఖులు శ్రీరామ్‌ హాజరైన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృత విద్యాసంస్థల్లో వివిధ ఆధునిక విషయాలను సంస్కృతంలోనే బోధించే విధానం అమలు చేయాలని కళాశాల అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ రాధా గోవింద్‌ త్రిపాఠి, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి సంస్కృత ఉపన్యాసకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆ పరీక్షలు రాయకుంటే పక్కా ఫెయిల్‌!

తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఆదేశాల మేరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌పై, ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌పై పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ జీ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు బుధవారం ఎథిక్స్‌ పరీక్ష, 23వ తేదీ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. రెండు సబ్జెక్టులు వంద మార్కులకు ఉంటాయని, ఇందులో కనీస ఉత్తీర్ణత మార్కులు 35 సాధించాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షలకు హాజరుకాపోయినా, ఉత్తీర్ణత మార్కులు సాధించకపోయినా ఇంటర్‌ ఫెయిల్‌ అయినట్లేనని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. గత ఏడాది ఈ సబ్జెక్టులల్లో తప్పిన విద్యార్థులు ఖచ్చితంగా పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని చెప్పారు. లేనిపక్షంలో మిగిలిన రెగ్యులర్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించినా సర్టిఫికెట్లు జారీ చేయమని తెలిపారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.

పీటీసీలో మోటివేషన్‌పై ప్రత్యేక శిక్షణ

చంద్రగిరి: మండలంలోని కల్యాణీ డ్యాం సమీపంలో ఉన్న పోలీసు ట్రైనింగ్‌ కళాశాల(పీటీసీ)లో మంగళవారం మోటివేషన్‌పై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. పీటీసీలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 750 మంది కానిస్టేబుళ్లు శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌కు చెందిన ఇంపాక్ట్‌ ఫౌండర్‌, సైకాలజిస్ట్‌, మోటివేషనల్‌ ట్రైనర్‌ గంపా నాగేశ్వర్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మానసిక ధైర్యం, వృత్తిపరమైన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీసు విధుల్లో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడం, ప్రజాసేవలో మానవీయ విలువలను పెంపొందించుకోవాల న్నారు. అనంతరం పీటీసీ అధికారులు ఆయన్ని సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్‌ సుబ్రమణ్యం, చిత్తూరు డీటీసీ డీఎస్పీ రాంబాబు, ఇంపాక్ట్‌ ప్రాంతీయ అధ్యక్షుడు ముకేశ్వర్‌, కార్యదర్శి తహనుశీనా బేగం, లక్ష్మీప్రసాద్‌, నాగిరెడ్డి పాల్గొన్నారు.

శుకబ్రహ్మాశ్రమంలో  విశేష హోమపూజలు 1
1/1

శుకబ్రహ్మాశ్రమంలో విశేష హోమపూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement