సేవలు అంతంత మాత్రమే
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, రాపూరు, బాలాయపల్లి, డక్కిలి, కలువాయి, వెంకటగిరి మండలాలకు గత ప్రభుత్వంలో సంచార పశు వైద్య వాహనాలను ఏర్పాటు చేసింది. 1962కు కాల్ చేసిన వెంటనే గ్రామాలకు వచ్చి పశువులకు వైద్య సేవలను అందించేవారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో పాడి రైతులకు క్షణాల్లోనే వైద్యం అందుతుండేది. నేడు అంతంత మాత్రంగానే అందుతున్నాయని పాడి రైతులు వాపోతున్నారు. సంచార పశువైద్య వాహనంలో వైద్యులు రాకపోవడంతోపాటు మందులు అందుబాటులో ఉండకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.


