గురువులే మార్గనిర్ధేశకులు | - | Sakshi
Sakshi News home page

గురువులే మార్గనిర్ధేశకులు

Sep 5 2025 5:48 AM | Updated on Sep 5 2025 5:48 AM

గురువ

గురువులే మార్గనిర్ధేశకులు

● ఎస్వీయూలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

తిరుపతి సిటీ : భావి భారతావనికి మార్గనిర్దేశకులు గురువులేనని ఎస్వీయూ వీసీ సీహెచ్‌ అప్పారావు కొనియాడారు. ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆయన ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొంది గురుతర బాధ్యతను దేశం గర్విచేలా నిర్వహించిన మహనీయులన్నారు. అబ్దుల్‌ కలాం ఉపాధ్యాయుడిని క్యాండిల్‌ వెలుగుతో పోల్చారని, తాను కరుగుతున్నా వెలుగునిచ్చేది గురువేనని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. వర్సిటీ సాంకేతికత పరంగా వృద్ధి చెందిందని, కృత్రిమ మేధస్సు, క్వాంటమ్‌ టెక్నాలజీతో మరింత అభివృద్ధి పథంలో నడిచేందుకు అడుగులు వేస్తోందన్నారు. రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు మాట్లాడుతూ.. గురువులు నిత్య విద్యా దాతలని, గురువును దేవుడిగా సమాజం భావిస్తుందన్నారు. అనంతరం 2025 సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న అధ్యాపకులు ఆచార్య ప్రయాగ, ఆచార్య చంద్రశేఖరయ్య, ఆచార్య నారాయణ, డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ సునీత, ఆచార్య చంద్రాయుడు, ఆచార్య జ్యోతి, ఆచార్య సరోజమ్మ, ఆచార్య నాగజ్యోతి, డాక్టర్‌ హేమలత రుద్రమదేవి, డాక్టర్‌ స్వరూప రాణి, డాక్టర్‌ శ్రీదేవి, డాక్టర్‌ రమేష్‌ బాబు, డాక్టర్‌ విజయలక్ష్మి, ఆచార్య సుబ్బారావు, ఆచార్య రమశ్రీ, ఆచార్య సుధారాణి, ఆచార్య హేమ, ఆచార్య అఖిల స్వతంత్రకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌ ప్రొఫెసర్‌ సుధారాణి, ఓవీఎస్‌రెడ్డి, ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్‌ శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గురువులే మార్గనిర్ధేశకులు 1
1/1

గురువులే మార్గనిర్ధేశకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement